BREAKING
రాహుల్ గాంధీ సంచలన వీడియో.. సీజేపీ నిరసనపై స్పందన డాక్టర్ కణితి విశ్వనాథం విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించండి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తపస్ హైస్కూల్ విద్యార్థులు అడ్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్రఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్

Select Suryaa Now
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్రఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్

కావలి,  మేజర్ న్యూస్ :   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ డూండీ రాకేష్‌కు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శాలువా కప్పి ఘనంగా సత్కరించి, హృదయపూర్వకశుభాకాంక్షలు తెలియజేశారు.  అనంతరం నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా డూండీ రాకేష్‌కు పరిచయం చేశారు. నియోజకవర్గ పరిధిలోని సమస్యలు, ఆర్యవైశ్యుల సంక్షేమం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై వారు కాసేపు చర్చించారు.ఈ కార్యక్రమంలో కావలి పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు కూడా పాల్గొని కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్‌ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఆర్యవైశ్య వర్గాల సంక్షేమానికి అందిస్తున్న సహకారానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.