ఎంఏఎం కళాశాలల్లో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
నరసరావుపేట మేజర్ న్యూస్ : ఎంఏఎం ఉమెన్స్ ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో నూతన విద్యార్థినులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాశాల చైర్మన్ మేదరమెట్ల రామ శేషగిరిరావు, డైరెక్టర్ దరువూరి శ్రావ్య పృథ్విరాజ్ విద్యార్థినులు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రిన్సిపాళ్లు డాక్టర్ సాదినేని రామారావు, దొండేటి చంద్రారెడ్డి విద్యతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించు కోవాలని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్, జూనియర్ విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రిపోర్టర్ మల్లికార్జున్…