BREAKING
జనసేన పార్టీలోకి భారీగా ముస్లిం మైనార్టీల చేరిక! రాహుల్ గాంధీ సంచలన వీడియో.. సీజేపీ నిరసనపై స్పందన డాక్టర్ కణితి విశ్వనాథం విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించండి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తపస్ హైస్కూల్ విద్యార్థులు అడ్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం

నగరాభివృద్ధికి టీటీడీ 200 కోట్లు విడుదల -జేఈఓకు టిటిడి చైర్మన్, వైస్ చైర్మన్ కృతజ్ఞతలు

Select Suryaa Now
నగరాభివృద్ధికి టీటీడీ 200 కోట్లు విడుదల  -జేఈఓకు టిటిడి చైర్మన్, వైస్ చైర్మన్ కృతజ్ఞతలు

తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం 2500 కోట్ల రూపాయలు నిధులు విడుదలపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గోవిందరావు హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం వారు టిటిడి జెఈఓ శరత్ కుమార్ ను మర్యాదపూర్వంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. తుడా పరిధిలోని వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన పనుల నిమిత్తం నిధులు విడుదల చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి వచ్చే లక్షలాది మంది భక్తులతో పాటు స్థానిక పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే తుడా ప్రధాన కర్తవ్యమని అన్నారు. తితిదే ద్వారా రూ.200 కోట్లు కేటాయించడం హర్షణీయమని, నిధులు విడుదల చేసి వెన్నుదన్నుగా నిలిచిన తితిదే బోర్డుకు తుడా తరఫున, తిరుపతి ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు.
వైస్ ఛైర్మన్ గోవిందరావు మాట్లాడుతూ తితిదే, తుడా సమన్వయంతో నగరంలో మౌలిక వసతుల విస్తరణకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని, భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రజా సౌకర్యాల మెరుగుదలకు తితిదే ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా.ఎన్.వి. శ్రీకాంత్ బాబు, ఎస్ఈ రవీంద్రయ్య పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి