BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

కుడి చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పల్లా*

Select Suryaa Now
కుడి చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పల్లా*


చేర్యాల  మేజర్ న్యూస్ ..…చేర్యాల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగలను ప్రజలందరూ ఐక్యంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం చేర్యాల పట్టణంలోని కుడి చెరువు వద్ద బతుకమ్మ వేడుకల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పండుగకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో పండుగను ఘనంగా జరుపుకోవడం తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రజల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందించి, ఐక్యతను చాటుతుందని అన్నారు.పార్టీలకు, కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కటై పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. చేర్యాల ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, అక్కచెల్లెళ్లకు సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న పాలకవర్గం, సంబంధిత అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలక వర్గం ,నాయకులూ ,ప్రజలు పాల్గొన్నారు .