జోగిపేట అభివృద్ధిపై మంత్రి దామోదర ప్రత్యేక ద్రుష్టి
జోగిపేట అభివృద్ధిపై మంత్రి దామోదర ప్రత్యేక ద్రుష్టి
-విద్య హాబ్ గా అందోల్
-మున్సిపాలిటీ చైర్మన్ కృష్ణారెడ్డి
అందోల్ :జోగిపేట అభివృద్ధిపై
రాష్ట్ర వైద్య ఆరోగ్య& శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనర్సింహ కృషితో ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీకి భారీ ఎత్తున నిధులను మంజూరు చేయడం జరిగిందని మున్సిపాలిటీ
చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి అన్నారు.
శుక్రవారం రాజనర్సింహ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకారుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
జోగిపేటలో ఉన్న నెహ్రూ మెమోరియల్ కళాశాలకు విద్యార్థుల అవసరాల నిమిత్తం కళాశాలలో మౌలిక సదుపాయాలు వసతులకై 22 కోట్ల 73 లక్షల 57,000 రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి (10) కోట్ల రూపాయలు నిధులు మంజూరు ఇంకా సరిపోకపోతే ఎన్నైనా నిధులు ఇవ్వడానికి మంత్రిగారు ఉన్నారు ఆయన అన్నారు. జోగిపేట బతుకమ్మ ఘాట్ నిర్మాణం నూకై (1)కోటి రూపాయలు నిధులతో పనులు చేరవేగంగా కొనసాగుతున్నాయి.మంత్రి గారి కృషితో ఆర్డీవో ఆఫీస్ నిర్మాణానికి(5) కోట్ల (75) లక్షల రూపాయలు నిధులుతో పనులు కొనసాగుతున్నాయి,జోగినాధ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రైతు వేదిక విశ్రాంతిభవనం ఆర్చి,CC రోడ్స్, దుకాణ సముదాయం కు గాను(3) కోట్ల(25) లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం పనులు కొనసాగుతున్నాయి. జోగిపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను గాను(2) కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగింది. అలాగే సంగుపేట ఎక్స్ రోడ్ నుండి అన్నాసాగర్ దర్గా వద్ద వరకు డివైడర్స్,సెంటర్ లైటింగ్ సిస్టమ్ను డివైడర్ మధ్యలో వివిధ రకాలైన పూల చెట్లతో ఆర్చి నిర్మాణం పనులు పూర్తికావస్తున్నాయి.అలాగే మైనార్టీ వారి కొరకై బహుదూర్ ఖాన్ ఫంక్షన్ హాల్ నిర్మాణమునకు (3) కోట్ల రూపాయలు నిధులు మంజూరు కావడం జరిగింది. జోగిపేట ప్రాంతం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో అజ్జ మర్రి వంతెన పనులు కొనసాగుతున్నాయి ఈ దారి పూర్తయితే అటు నర్సాపూర్ ఇటు జోగిపేట మధ్య దూరం తగ్గుతుంది దీనివల్ల అటువైపు ఉన్న 20 గ్రామాల ప్రజలు జోగిపేటకు రాకపోకలు కొనసాగిస్తారు వ్యాపారం పెరుగుతుందని ఉద్దేశంతో మంత్రిగారి పట్టుదలతో ఈ పనులు కొనసాగుతున్నాయి అలాగే పురాతనమైన క్లాక్ టవర్ అభివృద్ధి కొరకై నిధులు మంజూరు మంత్రి ద్వారా కృషి చేయడానికి ఇంకా ఆందోల్- జోగిపేటలో వివిధ వార్డులలో మిగిలిపోయిన పనులకు మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాకూరి వెంకటేశం,మాజీ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్స్,ఎస్ సురేందర్ గౌడ్, గూడెం మల్లయ్య, కౌన్సిలర్లు,గడ్డి అరుణ్ కుమార్, రాజశేఖర్, శ్రీనివాస్, హరికృష్ణ,మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్, తుపాకుల సునీల్ కుమార్, నాగరాజ్,ప్రవీణ్, శ్రీకాంత్,దుర్గేష్, చేనేత సంఘం అధ్యక్షుడు, పడిగే ఆత్మ కమిటీ&చేనేత డైరెక్టర్ చిట్యాల మధు,తుడుం యాదయ్య, కోఆప్షన్ నెంబర్స్, జిశాన్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,రవి శేఖర్ రెడ్డి,సైలాన్, అనిల్, శ్రీనివాస్,కృష్ణ, మురళి, నందు,కొత్త శ్రీశైలం,అబ్బ సాలి,సతీష్, వెంకటేశం తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.