జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం,విలువైన ప్రాణాలను కాపాడటానికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలి*
*జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*
*భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్*
*కలెక్టరేట్ లో ని వి.సీ హల్ లో జిల్లా కలెక్టర్, అనురాగ్ జయంతి ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్,రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి , ట్రాఫిక్ డిఎస్పీ ప్రభాకర్ రెడ్డి,జిల్లా స్థాయి అధికారులు, జాతీయ రహదారుల అధికారులు, ఇంజనీరింగ్, రవాణా అధికారులు తో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సమావేశంలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారు, జిల్లాలో ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి వాటి పై తీసుకున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ లను గుర్తించి రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా రక్షణ నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలను తగ్గించడంలో రహదారి భద్రతా చర్యలు కీలకమైనవని అన్నారు. ఈ చర్యలను తీసుకోవడంలో అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని, ప్రతి శాఖ సమిష్టిగా పని చేయాలని సూచించారు.
మానవ తప్పిదాలు, వాహనాలు, అత్యధిక వేగం వలన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయన్నారు.
రోడ్లపై రుంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్,స్పీడ్ లిమిట్,సూచిక బోర్డులు, బ్లింకర్స్ వంటివి ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయంతో జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు సంభవించకుండ పటిష్టంగా ఏర్పాట్లు చేయాలన్నారు. హైవే పై ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
*ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లడుతూ* రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించి నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు.
*ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అధికారి నరేష్ , సంబంధిత అధికారులు పాల్గొన్నారు*