జిల్లా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన పారిజాత
జిల్లా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన పారిజాత
గాంధీభవన్లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా చిగురింత పారిజాత నరసింహారెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గాంధీభవన్లో ఆమెను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెదిరే సికిందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పండల శంకర్, వరకల శ్రీరాములు తదితరులు పాల్గొని పారిజాత నరసింహారెడ్డికి అభినందనలు తెలియజేశారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల