telanagana
ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరై నూతన వస్త్రాలను అందజేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా
సూర్య ఆదిలాబాద్: సాత్నాల మండలం మేడిగూడ (ఆర్) గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు పథకం లబ్ధిదారులు ఓదెల నాగమణి - వేంకటి గృహ ప్రవేశానికి సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలను అందజేసి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇళ్ల నిర్మాణ ఖర్చులు, నాణ్యతా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, తహసిల్దార్ రామరావు, ఎంపీడిఓ జమీల్, హౌసింగ్ శాఖ ఏఈ గణేష్, స్థానిక ప్రజలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.