హత్నూర ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో దౌల్తాబాద్ టు సిరిపురం ప్రధాన రహదారి దుస్థితిని నిరసిస్తూ ఆదివారం హత్నూర ప్రధాన రోడ్డు పై హత్నూర గ్రామ ప్రజలు రాస్తారోకో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా నాయకులు మైసగళ్ల బుచ్చేంద్ర మాదిగ మాట్లాడుతూ, దౌల్తాబాద్ టు సిరిపురం ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులు, గ్రామ ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రహదారి దుస్థితి కారణంగా ప్రమాదాలు జరుగుతూ కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయాలతో బయటపడుతున్నారని తెలిపారు.ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి చొరవ తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ గారు, R&B శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రహదారి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
దేవులపల్లి మహేష్ మాదిగ MSF జిల్లా కన్వీనర్,MRPS నాయకులు నల్లొల్ల మొగులయ్య, కొండగళ్ల దుర్గయ్య, కొండగళ్ల శ్రీధర్, మహంకాళి, మహమ్మద్ ఆసిఫ్, MD. ఈషా తో పాటు నల్లోల్ల కుమార్ ,ప్రవీణ్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, హత్నూర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.