గ్రీన్ప్యానెల్ ఇండస్ట్రీస్లో 36 ఉద్యోగాలకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ లో భాగంగా తిరుపతి జిల్లాలోని మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ప్రముఖ పారిశ్రామిక సంస్థ *Greenpanel Industries Limited (గ్రీన్ పానెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్)* లో వివిధ విభాగాల్లో మొత్తం *36 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రత్యక్ష ఇంటర్వ్యూలు* నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ ఉద్యోగ నియామక ప్రక్రియలో *ఫ్రెషర్స్తో పాటు సంబంధిత రంగాల్లో 2 నుంచి 10 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులకు కూడా* పోస్టును బట్టి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని శ్రీ ఆర్. లోకనాథం గారు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, తిరుపతి జిల్లా వారు తెలిపినారు.
*ఉద్యోగ ఖాళీల వివరాలు*
గ్రీన్ప్యానెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో క్రింది విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి:
* మిషినిస్ట్ సాంకేతిక నిపుణులు
* వెల్డర్లు
* రిగ్గర్లు
* విద్యుత్ సాంకేతిక నిపుణులు
* సహాయకులు
* విద్యుత్ ఆటోమేషన్ – అసిస్టెంట్ మేనేజర్లు
* లాజిస్టిక్స్ – సూపర్వైజర్లు
* కెమిస్టులు
* గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీలు
*విద్యార్హతలు*
అభ్యర్థులు క్రింది విద్యార్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి:
*ఐటీఐ – ఫిట్టర్, ఐటీఐ – ఎలక్ట్రికల్, ఐటీఐ/ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీఎస్సీ – కెమిస్ట్రీ, బీటెక్ – ఈసీఈ, ఈఈఈ, మెకానికల్.*
*ఉద్యోగ వివరాలు*
* *మొత్తం ఖాళీలు:* 36
* *వేతనం:* సంవత్సరానికి రూ.2.10 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు
* *వయస్సు:* 20 నుంచి 35 సంవత్సరాలు
* *అభ్యర్థులు:* పురుషులు మాత్రమే
* *అనుభవం:* ఫ్రెషర్స్ నుంచి 2–10 సంవత్సరాల అనుభవం వరకు, పోస్టును బట్టి
ప్రత్యక్ష ఇంటర్వ్యూ వివరాలు*
*తేదీ & దినం:* 22-10-2026 & గురువారం
*నివేదించాల్సిన సమయం:* ఉదయం 8:30 గంటల నుంచి
*ఇంటర్వ్యూ వేదిక:* గ్రీన్ప్యానెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సర్వే నెo: 97/1, 98/1, 99/1, రౌతుసురమాల, తొట్టంబేడు మండలం, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా.
*9000109045 | 6303578886 | 9988853335
H. Dwaraka, staff reporter, tpt 9705347341