BREAKING
మదనపల్లెలో భారీ బందోబస్తు నామినేషన్ కేంద్రం వద్ద డ్రోన్లతో పోలీసుల నిఘా పూల సంబురానికి సిద్దమవుతున్న బతుకమ్మలు హిందీ రాకపోయినా క్లిష్టమైన గజల్స్ పాడిన దిగ్గజ సంగీత దర్శకుడు దేవా.. గాయని చిన్మయి ఎమోషనల్ పోస్ట్! మహబూబాబాద్ లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి-జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి బార్ అసోసియేషన్ వినతి పెనుకొండలో టీడీపీకి వైఎస్సార్‌సీపీ సవాల్.. చైర్మన్ బరిలో శ్రీనివాసులు! కోల్‌కతా దుర్గా పూజ తొక్కిసలాట విషాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు! మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రొంగలా అనూష నామినేషన్ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం :ఎమ్మెల్యే కొండయ్య ఊరెళ్తున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త! ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ పి. కిరణ్ తహసిల్దార్ కార్యాలయం లేక పార్టీ కార్యాలయమా-బి ఆర్ ఎస్ జిల్లా నాయకురాలు ధనలక్ష్మి నామినేషన్ల వేళ ముందస్తు అరెస్టులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ రికార్డు సునామీ.. 2026లోనే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా 'జైలర్ 2'! పోలేరమ్మ విగ్రహాప్రతిష్ట మహోత్సవం. వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి:మాజీ సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి ప్రపంచ వేదికపై 'రామాయణం' రికార్డు.. లాస్ ఏంజిల్స్ అకాడమీ మ్యూజియంలో గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్!

పేద కుటుంబాలకు దసరా కానుకలు

Select Suryaa Now
పేద కుటుంబాలకు దసరా కానుకలు

పేద కుటుంబాలకు దసరా కానుకలు

 

జాపాలలో 25 కిలోల బియ్యం, చీరలు, నిత్యావసర సరుకుల పంపిణీ

 

పండుగ వేళ నిరుపేద కుటుంబాల్లో ఆనందం నింపేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ జాపాల గ్రామ మాజీ అధ్యక్షుడు బకున చంద్రకాంత్‌ (చందు) ముందుకొచ్చారు. దసరా పండుగను పురస్కరించుకొని జాపాల గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు దసరా కానుకలను పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం బ్యాగు, ఒక చీరతోపాటు ఏడు రకాల నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ మంచాల రవి, వార్డు సభ్యులతో కలిసి కానుకలను పంపిణీ చేశారు. పండుగ సమయంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మంథని అండాలు, మలేష్ యాదవ్, మంథని మనిషా, పరమేష్ యాదవ్, బకున సోమేశ్వర్, అనుమండ్ల వెంకటేష్, బీఆర్‌ఎస్‌ గ్రామ కార్యదర్శి అనుమండ్ల సంజీవ్‌తోపాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల