కనులవిందుగా భరతనాట్య ప్రదర్శన
సూర్య బోథ్ :దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై జరిగిన కూచిపూడి మరియు భరత నాట్య ప్రదర్శన భక్తులను కళాభిమానులను విశేషంగా అలరించింద.ఇవి మాత్రమే కాకుండా ఇతర సాంప్రదాయ నృత్య ప్రదర్శన అత్యంత వైభవంగా సాగింది.మొదట విగ్నేశ్వరుని ప్రార్థనతో ప్రారంభమై ఒక్కొక్క నాట్య ప్రదర్శన ఒక్కో సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పారు.అందులో భాగంగా అమ్మవారి నవరాత్రి విశేషాలుదుర్గాదేవి మహిమలుసమాజం లో భారతీయ మహిళ యొక్క ఉన్నతిమహిషాసుర మర్దిని రూప ప్రదర్శన లో పిల్లలు అమ్మవారిని సాక్షాత్కరించిన విధము అధ్యంతం ఆసక్తికరంగా జరగడమే కాకుండా చెడు ఫై మంచి సాధించే విజయాన్ని చాటి చెప్పడం చూపరులని ఎంతో ఆకట్టుకుంది.కళాకారులు ప్రదర్శించిన శివాష్టకం మరియు కూచిపూడి నృత్య విశిష్టత అయినా తరంగం నృత్యం వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది చప్పట్లతో వేదిక మార్మోగింది.కార్యక్రమం ముగింపులో దుర్గా కమిటీ నిర్వాహకులు నాట్యం చేసిన విద్యార్థులందరిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు విచ్చేసిన వందలాది మంది భక్తులు ఈనాటి ఉత్సవాన్ని వీక్షించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.