బహుజన్ సమాజ్ పార్టీ తరపున రాంప్రసాద్
శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తరఫున ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా రిజర్వేషన్ల ఆధారంగా సంజీపురం, ఈదుల ముష్టూరు, బత్తలపల్లి-1 మరియు మాల్యావంతం ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత అభ్యర్థులను ఖరారు చేసినట్లు మండల ఎన్నికల ఇంచార్జ్, జిల్లా కార్యదర్శి మాల్యావంతం రాంప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని మిగిలిన స్థానాల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులు, బహుజనుల హక్కుల కోసం పనిచేయాలనే తపన ఉన్నవారు రిజర్వేషన్లకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 20వ తేదీలోపు తమ దరఖాస్తులను పార్టీ నాయకత్వానికి సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాంప్రసాద్ కోరారు.