స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
– మాజీ జెడ్పీటీసీ భూతరాజు, మాజీ ఎంపీపీ రాధమ్మ, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొంకల్లు శివకుమార్
గుడిబండ మేజర్ న్యూస్:
గుడిబండ మండలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ జెడ్పీటీసీ భూతరాజు, మాజీ ఎంపీపీ రాధమ్మ, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొంకల్లు శివకుమార్ పిలుపునిచ్చారు.గుడిబండ మండలం కొంకల్లు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలు, 16 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ ప్రజల్లోకి వెళ్లాలని, ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.