BREAKING
భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్.. వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన మూవీ కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ: రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇథియోపియా నేషనల్ ప్యాలెస్, మ్యూజియంను సందర్శించిన విదేశాంగ మంత్రి జైశంకర్ బీసీలకు టీడీపీ అండగా ఉంటుంది బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు

హైవే పనుల్లో నాణ్యతకు గండి

Select Suryaa Now
హైవే పనుల్లో నాణ్యతకు గండి

 

తుపుపట్టి  స్టీల్‌తో కల్వర్ట్‌.. బండరాళ్లతో రోడ్డు నిర్మాణం
*కోట్లాది ప్రజాధనంతో పనులు.. 
*ప్రమాణాలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా నిర్మాణం చేస్తున్నారంటూ ప్రజల ఆగ్రహం
*పోనేకల్ నుంచి కొరివి హైవే 
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న హైవే పనుల్లో నాణ్యత ప్రమాణాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోనేకల్‌ నుంచి కొరివి వైపు చేపడుతున్న కల్వర్ట్‌, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో తుప్పుపట్టిన ఇనుప స్టీల్‌ను వినియోగిస్తున్నారని, స్టీల్‌ స్పేసింగ్‌, ఎత్తు, వెడల్పు తదితర నిర్మాణ ప్రమాణాల్లోనూ నిబంధనలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజాధనంతో చేపడుతున్న ప్రతిష్ఠాత్మక హైవే పనుల్లో ఇంత నిర్లక్ష్యమా అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రావెల్‌కు బదులు బండరాళ్లు.. పైన మట్టి!
హైవే రోడ్డు నిర్మాణంలో నాణ్యమైన గ్రావెల్‌ ఉపయోగించాల్సి ఉండగా, బండరాళ్లు వేసి వాటిపై మట్టిని నింపుతూ రోలర్‌తో పైభాగాన్ని లెవెల్‌ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా చేస్తే భవిష్యత్‌లో రోడ్డు నాణ్యతపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రాజెక్టును పల్లెటూరు రోడ్డు మాదిరిగా నామమాత్రంగా నిర్మిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
రైతులకు పరిహారం ఏదీ?
అరేకోడు సర్వే నంబర్‌ 80లో రైతు ఉపుగండ్ల వెంకటేశ్వర్లుకు పైప్‌లైన్‌, పంప్‌హౌస్‌, మామిడి చెట్లకు సంబంధించిన నష్టపరిహారం ఇంకా అందలేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం చెల్లింపులు పూర్తికాకముందే రోడ్డు పనులు చేపట్టడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పలువురు రైతులకు కూడా నష్టపరిహారం బకాయిలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.
అధికారులు వెంటనే రంగంలోకి దిగాలి
హైవే పనులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తక్షణమే పనులను నిలిపివేసి క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కల్వర్ట్‌, బ్రిడ్జి నిర్మాణంలో ఉపయోగిస్తున్న స్టీల్‌ నాణ్యత, స్పేసింగ్‌, కొలతలు, రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్న మెటీరియల్‌ను నిపుణులతో పరీక్షించాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు బిల్లుల చెల్లింపులను నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
“కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్న హైవేను నాణ్యత లేకుండా నిర్మిస్తే భవిష్యత్‌లో ప్రజలే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పనులను తనిఖీ చేయాలి” అని స్థానికులు కోరుతున్నారు.