గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
రేగోడు : గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని రేగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిగంబర్ రావు అన్నారు.ఆదివారం రేగోడు మండలంలోని మక్త వెంకటాపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి నాగరాజు పలువురు పార్టీ శ్రేణులు మండల పార్టీ అధ్యక్షులు దిగంబర్ రావు, పిసిసి సభ్యులు మున్నూరు కిషన్, మెదక్ జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు మన్నే విజయభాస్కర్, డిసిసి కార్యదర్శి రాజేందర్ పాటిల్, రేగోడు మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు చోటు మియా ల సమక్షంలో మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ,పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు మండల పార్టీ అధ్యక్షులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగమేశ్వర్, మాజీ ఎంపిటిసి మన్నె నరేందర్, ఏఎంసీ డైరెక్టర్లు కల్లేటి శ్రీధర్ గుప్తా, ఫాజిల్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.