గోంట్లపేట్‌లో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు
సూర్య, పెంచికల్‌పేట్ : మండలం లోని గోంట్లపేట్ బస్టాండ్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. పెంచికల్‌పేట్–కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై వాహనాల అతివేగాన్ని నియంత్రించేందుకు సర్పంచ్ దుర్గం పోషన్న ఈ చర్యలు చేపట్టారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటించి, అప్రమత్తంగా ప్రయాణించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు దాసరి కైలాసం, ఎండీ అతిక్, కామ్రే మొండి, గజన్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.