గౌరవ వేతనం అందజేయాలి ఎంపీడీవోకి వినతి పత్రం అందజేసిన ఉపసర్పంచ్లు
గౌరవ వేతనం అందజేయాలి
ఎంపీడీవోకి వినతి పత్రం అందజేసిన ఉపసర్పంచ్లు
కుకునూరుపల్లి, ....ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చింతల నాగరాజు ఆధ్వర్యంలో శనివారం ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు గౌరవ వేతనంతో పాటు చెక్ పవర్ అవకాశం కూడా కల్పించాలని ఎంపీడీవో మహబూబ్ అలీకి వినతి పత్రం అందజేసిన వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు,
ఈసందర్భంగా మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చింతల నాగరాజు మాట్లాడుతూ ఉప సర్పంచ్లకు రూ.5000 వేతనం, వార్డు సభ్యులకు మూడు వేల వేతనం అందజేయాలని,
మండల సర్వసభ్య సమావేశాలకు గ్రామాలలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు వార్డు సభ్యుల కు
ఆహ్వానాలు ఇవ్వాలని,
వి.బి.జి రామ్ జీ పథకాలలో పనుల మంజూరుకు చెక్ పవర్ అవకాశం కల్పించాలని ఎంపీడీవోను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.