BREAKING
ఆకుకూరలు వాడిపోకుండా రోజుల తరబడి తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి! నోటి ఆరోగ్యానికి నాలుక శుభ్రత ఎంత ముఖ్యం? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? కలకత్తాలో చారిత్రక ఫుట్‌బాల్ సమరం: భారత జట్టుపై 4-0తో బ్రెజిల్ ఘన విజయం.. డీప్‌ఫేక్ వీడియోలపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్.. సైబర్ క్రైమ్‌లో అధికారిక ఫిర్యాదు! నేషన్స్ లీగ్‌లో ఎస్టోనియా అద్భుత విజయం:లక్సెంబర్గ్‌పై గెలుపుతో గ్రూప్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లిన వైనం ఆ నెగెటివిటీ కారణంగానే షో Host చేయడానికి వెనుకాడాను.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! లైగర్ సినిమా కోసం నీళ్లు కూడా తాగలేదు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు! ఎన్నికల సంఘం నిర్ణయాలకు వ్యతిరేకంగా ఠాక్రే సోదరుల సమరశంఖం.. బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున సీరియస్.. కంటెస్టెంట్లకు రెడ్ అండ్ ఎల్లో కార్డుల మోత! సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలి: హీరో రామ్ పోతినేని సంచలన వ్యాఖ్యలు భారత ఆర్థిక ప్రగతి ప్రయాణం అద్భుతం ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.. విషాదంలో సినీ లోకం! ఎంఈఐటీవై ఆదేశాల తర్వాత భారత యాప్ స్టోర్ నుంచి 'బిట్‌చాట్' తొలగించిన ఆపిల్, వెల్లడించిన జాక్ డోర్సీ ది లలిత్‌లో నెస్లే డెయిరీ వైటెనర్ నమూనా 'అసురక్షితం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి

మేడ్చల్ చెక్‌పోస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం

Select Suryaa Now
మేడ్చల్ చెక్‌పోస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం

ఫర్నిచర్ షాపులో దగ్ధమైన సామగ్రి.. పక్క షాపులకు వ్యాపించిన మంటలు

మేడ్చల్, మేజర్ న్యూస్, (అక్టోబర్ 4): మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ షాపులో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఇతర షాపులకు వ్యాపించడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఫర్నిచర్ షాపులోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. మంటలు పక్క షాపులకు వ్యాపించకుండా స్థానికులు అప్రమత్తమై ఆయా దుకాణాలను ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. కళ్లముందే దుకాణాలు, సామగ్రి దగ్ధం కావడంతో యజమానులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రిపోర్టర్ తలారి శివకుమార్.