సోమవారం జిల్లా ప్రజావాణి రద్దు
సూర్యఆదిలాబాద్: జిల్లా స్థాయి అధికారులు నిర్మల్‌లో సోమవారం నిర్వహించనున్న రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన జిల్లా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఆదివారం తెలిపారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను ఆయా మండలాల్లో అధికారులకు సమర్పించుకోవాలని సూచించారు.