BREAKING
ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎస్పీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌. డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య లను సన్మానించిన జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాషా టీచర్లు లేకుండా పదో తరగతి విద్యార్థుల భవిష్యత్‌ ఎలా? పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం జీ హెచ్ ఎం సీ కీలక నిర్ణయం ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వనస్య ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను సందర్శించి జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 *వాహనదారులకు విద్యార్థుల కౌన్సెలింగ్ ఎస్సై కుటుంబరావుగారు* గుత్తిలో నూతన వస్త్ర దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రైతాగ్రహం.. కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్.. మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఆయుష్మాన్ ఖురానా కొత్త చిత్రం ‘ముపాపా’: హీరోయిన్‌గా ‘బందిష్ బండిట్స్’ ఫేమ్ శ్రేయా చౌదరి ఎంపిక ఉప్పల్‌లో బీఆర్‌ఎస్ పార్టీలోకి పోలినేని సంపత్ రావు చేరిక

మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

సూర్య,  బెజ్జుర్ :

కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం లోని సలుగుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ఎస్‌ పాఠశాలను బెజ్జూర్ ఎస్సై విజయ్ సందర్శించి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన.. జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, విద్యార్థి దశలోనే మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. గంజాయి, గుట్కా, గుడుంబా, మాదక ద్రవ్యాలు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, వాటి ప్రభావానికి లోనుకాకుండా చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు పౌరులని, ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ద్విచక్ర వాహనాలు నడపాలని, మైనర్లు వాహనాలు నడిపి చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకోవద్దని హెచ్చరించారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయాలు లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 100 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై విజయ్ సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచ్ కార్యదర్శి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.