ఉప్పల్‌లో బీఆర్‌ఎస్ పార్టీలోకి పోలినేని సంపత్ రావు చేరిక
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి మరో బలం చేకూరింది. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, ఉద్యమకారుడు పోలినేని సంపత్ రావు తిరిగి సొంత గూటికి చేరారు.
ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా గులాబీ కండువా కప్పి పోలినేని సంపత్ రావును బీఆర్‌ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సంపత్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు పోషించిన పాత్రను గుర్తించి, వారికి అండగా నిలిచిన పార్టీ బీఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. ఉద్యమకారులకు బీఆర్‌ఎస్ పార్టీతోనే న్యాయం జరిగిందని, ఉద్యమకారుల సంక్షేమం, గౌరవం కోసం గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన ఉద్యమకారుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటం తమ లక్ష్యమని సంపత్ రావు అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ, పార్టీతో అనుబంధం ఉన్న నాయకులు, ఉద్యమకారులు తిరిగి బీఆర్‌ఎస్ కుటుంబంలోకి రావడం సంతోషకరమన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు, ఉద్యమకారుడికి తగిన గౌరవం ఉంటుందని తెలిపారు.
ఉద్యమ స్ఫూర్తితో.. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా.. బీఆర్‌ఎస్ కుటుంబం మరింత బలోపేతం అవుతుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు