ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎస్పీ
గుంతకల్లు నూతన డీఎస్పీగా నియమితులైన బొల్లు శ్రీనివాసరావు సోమవారం గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నూతన డీఎస్పీ శ్రీనివాసరావు ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతిభద్రతలు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించే అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు.