మహిళా ఎస్సై కుటుంబానికి ఆకతాయిల వేధింపులు
మహిళా ఎస్సై కుటుంబానికి ఆకతాయిల వేధింపులు
విజయవాడ క్రైం , అక్టోబర్ 5, మేజర్ న్యూస్, ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : విజయవాడలో మహిళా ఎస్సై ప్రమీల కుటుంబాన్ని ఇద్దరు యువకులు వేధించిన ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఎస్సై కారును ఇద్దరు యువకులు వెంబడించడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గొల్లపూడికి చెందిన భరద్వాజ, మణిదీప్‌గా గుర్తించారు. ఇద్దరూ గంజాయి, మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.