BREAKING
ఈ ఏడాది చివరి నాటికి భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు: ఫిన్లాండ్ రాయబారి వెల్లడి రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడి మృతి గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరి: ప్రధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్.. ఆ ప్రత్యేక పండుగ రోజున థియేటర్లలోకి! ఓటీటీలోకి వచ్చేస్తున్న సూరి, సుహాస్ బ్లాక్‌బస్టర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? నంద్యాలలో పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజావాణికి రెండు దరఖాస్తులు హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టామ్ క్రూయిజ్ భారీ షాక్.. ఇండియాలో మూడు రోజుల్లో కేవలం రూ. 1.5 కోట్లే వసూలు చేసిన డిగ్గర్! పదవి లేకున్నా ప్రజాసేవలో ముందడుగు వి ఆర్ ఏ తమ సమస్యలు పరిస్కారం కోరుతూ చేపట్టిన పోరు బాట కుటుంబ సభ్యుల సమక్షంలో సోహా అలీ ఖాన్ బర్త్ డే వేడుకలు.. కూతురు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ వైరల్! అంగన్వాడీ కేంద్రంలో బాల అమృతం పంపిణీ డాక్టర్ లేని ఆసుపత్రిలో చికిత్స దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి ఐటీ రైడ్స్‌పై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ అవాస్తవ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు!

డ్రోన్ సిటీ ఫేజ్ ఫేజ్–1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
డ్రోన్ సిటీ ఫేజ్  ఫేజ్–1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలి*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు, అక్టోబర్ 05:- డ్రోన్ సిటీ ఫేజ్  ఫేజ్–1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఏపిఐఐసి అధికారులను ఆదేశించారు..

సోమవారం ఓర్వకల్లు మండలం కొమరోలు గ్రామంలో ఏర్పాటు చేయనున్న  డ్రోన్ సిటీ మొదటి దశ పనులను కలెక్టర్ పరిశీలించారు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రోన్ సిటీ ఫేజ్  ఫేజ్–1 కు సంబంధించి  రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులు ఒప్పందం ప్రకారం నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు..నీటి సరఫరా పనులను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం,  సంప్ పనులను మరో నెలన్నరలోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులను పాటిస్తూ నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఏపిఐఐసి జెడ్ ఎం మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి సంజీవ రాజు, ఏపిఐఐసి అధికారి సందీప్ , ఓర్వకల్లు తహసిల్దార్ విద్యా సాగర్ తదితరులు పాల్గొన్నారు