BREAKING
ఈ ఏడాది చివరి నాటికి భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు: ఫిన్లాండ్ రాయబారి వెల్లడి రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడి మృతి గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరి: ప్రధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్.. ఆ ప్రత్యేక పండుగ రోజున థియేటర్లలోకి! ఓటీటీలోకి వచ్చేస్తున్న సూరి, సుహాస్ బ్లాక్‌బస్టర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? నంద్యాలలో పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజావాణికి రెండు దరఖాస్తులు హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టామ్ క్రూయిజ్ భారీ షాక్.. ఇండియాలో మూడు రోజుల్లో కేవలం రూ. 1.5 కోట్లే వసూలు చేసిన డిగ్గర్! పదవి లేకున్నా ప్రజాసేవలో ముందడుగు వి ఆర్ ఏ తమ సమస్యలు పరిస్కారం కోరుతూ చేపట్టిన పోరు బాట కుటుంబ సభ్యుల సమక్షంలో సోహా అలీ ఖాన్ బర్త్ డే వేడుకలు.. కూతురు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ వైరల్! అంగన్వాడీ కేంద్రంలో బాల అమృతం పంపిణీ డాక్టర్ లేని ఆసుపత్రిలో చికిత్స దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి ఐటీ రైడ్స్‌పై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ అవాస్తవ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు!

పట్టభద్రులారా మేల్కొనండి, ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి : బీజేపీ జిల్లా నాయకులు సోమ శేఖర్ గౌడ్, మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు

Select Suryaa Now
పట్టభద్రులారా మేల్కొనండి, ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి : బీజేపీ జిల్లా నాయకులు సోమ శేఖర్ గౌడ్, మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు

కృష్ణ , సూర్య న్యూస్ :

ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు సోమ శేఖర్ గౌడ్, మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలన్నారు. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదని అది సమాజం పట్ల మనకున్న బాధ్యత అన్నారు.ముఖ్యంగా ప్రజల సమస్యలు, ఆకాంక్షలు, అభిప్రాయాలను శాసనమండలిలో సమర్థవంతంగా ప్రతిబింబించే సరైన ప్రతినిధులను ఎన్నుకునే అవకాశాన్ని ఓటు హక్కు మనకు అందిస్తుందని తెలిపారు. డిగ్రీ పూర్తిచేసిన యువత, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు తప్పనిసరిగా ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని వారు తెలిపారు. ముఖ్యంగా  ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు కావలసిన పత్రాలు

ఫారం–18,డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ / మార్కుల మెమో ,ఆధార్ కార్డు , ఓటర్ ఐడీ కార్డు,పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇతర ప్రామాణిక గుర్తింపు పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం, అధికారిక ఓటరు జాబితాలో తమ పేరు సరిగ్గా నమోదు అయ్యిందో లేదో ప్రతి ఒక్కరూ తప్పకుండా పరిశీలించుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు సోమ శేఖర్ గౌడ్, మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలిపారు.

 

*---నర్సిములు,సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం*