పదవి లేకున్నా ప్రజాసేవలో ముందడుగు
*పదవి లేకున్నా ప్రజాసేవలో ముందడుగు*
*హైలెవల్ వంతెన గుంతకు ఏల సుందర్ పరిష్కారం.. వాహనదారులకు ఊరట*
*అధికారుల నిర్లక్ష్యానికి భిన్నంగా స్వచ్ఛందంగా మరమ్మతులు చేపట్టిన ఏల సుందర్*
దేవరుప్పుల అక్టోబర్ 05 మేజర్ న్యూస్ (సూర్య):
దేవరుప్పుల మండల కేంద్రంలోని హైలెవల్ వంతెనపై ఏర్పడిన ప్రమాదకర గుంతపై సోమవారం వచ్చిన వార్తలకు స్పందించిన బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు, సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ సేవా దృక్పథంతో ముందుకొచ్చారు. వంతెనపై గుంత ఏర్పడి నెలలు గడుస్తున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి స్వయంగా మరమ్మతులు చేపట్టారు. జేసీబీని ఏర్పాటు చేసి గుంత వద్ద పగిలిన కాంక్రీట్ పెచ్చులను తొలగించి గుంత పడిన వద్ద చదును చేయించారు. అనంతరం గుంతలో కాంక్రీట్ పోయించి వంతెనను ప్రతిష్ట మరమ్మతు చేయించారు. దీంతో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు తొలగాయి. గత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, ప్రజల సమస్యలను గుర్తించి తనవంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏల సుందర్ ఈ సేవా కార్యక్రమం చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందించిన ఏల సుందర్‌కు గ్రామ ప్రజలు, వాహనదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు గ్రామస్తులు వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.