BREAKING
గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా పిజిఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్లు ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించి, వారికి భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేసి, కంచె ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌కు వినతి ఎ ఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా .ప్రజల సమస్య లను వేగంగా, నిష్పక్ష పాతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయo రేడియల్ రోడ్ బాధితులు పరిహారం అందజేత 6 నుండి 8 వరకు'సేవ సేతు అభియాన్' క్యాంప్. పల్లె దవఖానాలను ఏర్పాటు చేయండి వెలుగు సంస్థలో ఘనంగా ఎం. ఉదయ్ కార్తికేయ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రస్థాయి పోటీలకు చందలూరు విద్యార్థులు . ప్రజల సమస్యల పరిష్కరించాలి. విద్యుత్ శాఖ ఈ ఈ. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు మారెళ్ళ విద్యార్థులు. పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 184 మంది పోలీసు సిబ్బందికి సమాచార దీపికలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేసి చంద్రబాబు చేసేది అభివృద్ధా..?

స్మార్టు కిచెన్‌కు రూ 32 లక్షలు కార్పొరేటు సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR ) విరాళం

Select Suryaa Now
స్మార్టు కిచెన్‌కు రూ 32 లక్షలు కార్పొరేటు సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR ) విరాళం

దీపక్ నెక్ట్జన్( Deepak Nextgen) యండి శ్రీ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సహకారం అభినందనీయం

మరిన్ని కార్పొరేటు సంస్థలు ముందుకు రావాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు

ఏలూరు,: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కింద చేపట్టిన స్మార్ట్ కిచెన్ కార్యక్రమానికి సామాజిక బాధ్యతలో భాగంగా దీపక్ నెక్ట్జన్( Deepak Nextgen) యండి ఏ.వి. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రూ 32 లక్షలు విరాళ చెక్కును జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు మరియు సంబంధిత వర్గాలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు కార్పొరేటు సంస్థలు తమ CSR నిధులు ద్వారా సహకరించడం  శుభపరిణామం అన్నారు. జిల్లాలో దెందులూరులో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం  పథకం కింద స్మార్టు కిచెన్ కార్యక్రమం ద్వారా అవసరమైన మౌళిక సదుపాయాలను మరింత మెరుగుపరచడం, వంటశాలలు నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించడం జరుగుతుందని తెలిపారు. పరిశుభ్రతతో కూడిన వంటలు ప్రక్రియను ప్రోత్సహించడం, అలాగే నాణ్యమైన ఆహారాన్ని అందించేలా అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వనున్నామని తెలిపారు.స్మార్టు కిచెన్ వంటి ప్రజోపయోగ కార్యక్రమాలు అమలుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రైవేటు సంస్థలు, పారిశ్రామిక వర్గాలు, దాతలు మరియు వివిధ సంస్థలు CSR ద్వారా భాగస్వాములు కావడం వల్ల కార్యక్రమాలు  మరింత విస్తృతంగా జరుగుతాయని పేర్కొన్నారు. సమాజానికి తిరిగి సేవ చేయాలనే బాధ్యతతో Deepak Nextgen సంస్థ అందించిన రూ 32 లక్షలు సహకారం ఈ కార్యక్రమానికి మరింత ఊతమివ్వనుందని అన్నారు. ఈ సందర్భంగా CSR నిధులను ప్రజోపయోగ కార్యక్రమాలకు అందిస్తూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్న Deepak Nextgen సంస్థను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక ప్రయోజన కార్యక్రమాలకు కార్పొరేటు సంస్థలు సహకారం మరింత కొనసాగాలని, మరిన్ని కార్పొరేటటు సంస్థలు ముందుకు రావాలని జిల్లా కలెక్టరు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, ఇంచార్జి జిల్లా రెవిన్యూ అధికారి యం.ముక్కంటి, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టరు యల్.దేవకీదేవి, దీపక్ నెక్ట్జన్  డైరెక్టరు శ్రీ చైతన్య , జిల్లా సిఎస్ఆర్ ఇంచార్జి, జిల్లా స్కిల్ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి యన్.జితేంద్రబాబు, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంటు ఏడి వెంకటప్పయ్య, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.