రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడి మృతి
రిపోర్టర్ : రమేష్ బాబు కొండల
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడి మృతి
రేణిగుంట మేజర్ న్యూస్ :రేణిగుంట -పూడి రైల్వే స్టేషన్ మధ్య మైలాపూర్ ఫుడ్ కంపెనీ సమీపంలో రైలు పట్టాల పక్కన సుమారు 75 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైంది.గుర్తుతెలియని రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడటంతో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై తెల్లని పంచ, తెలుపు రంగు ఫుల్‌హ్యాండ్ షర్ట్, తెల్లని కండువా ఉన్నాయి. మెడలో ఎరుపు రంగు దారం, రుద్రాక్ష ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించేందుకు రేణిగుంట రైల్వే జీఆర్పీ పోలీసులు చర్యలు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రేణిగుంట రైల్వే జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని పోలీసులు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.