BREAKING
కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి మోల్బియో డయాగ్నస్టిక్స్ షేర్లపై మోతీలాల్ ఓస్వాల్ ‘బై’ రేటింగ్: రూ. 1,800 టార్గెట్ ప్రైస్ సేవా సంకల్పంతో మెగా హెల్త్ క్యాంప్ బుడగజంగాలకు ఎస్సీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్లకు నిర్మల్ బాంగ్ ‘బై’ రేటింగ్: 40 శాతం అప్‌సైడ్‌తో రూ. 1,340 టార్గెట్ ప్రైస్ కొడంగల్ అభివృద్దే లక్ష్యం... నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తిరుపతి రెడ్డి ఓట్ల తొలగింపు పై సిపిఐ నిరసన. ఈసీ చీఫ్ రాజీనామాకు డిమాండ్. హైవే లో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్రగాయాలు. ముంబై రియల్ ఎస్టేట్ రికార్డు జోరు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేపు కలెక్టరేట్‌ ఎదుట నిరసన బ్యాంక్ అధికారినంటూ మోసం నిందితుడి అరెస్ట్ లైబ్రరీ , ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష హుండీ ఆదాయం రూ.15.13 లక్షలు దాయాదిపై దాడికి పాల్పడిన ఘటనలో మాజీ జెడ్పిటిసి శ్రీశైలం పై కేసు నమోదు ,అరెస్ట్ -నాగర్ కర్నూల్ ఎస్సై వెంకట్ రెడ్డి పాకిస్థాన్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం: పీటీఐతో చర్చలు విఫలం..

అనంత ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Select Suryaa Now
అనంత ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

అనంతపురం ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. వైస్‌ ప్రిన్సిపాల్ రామావత్ శ్రీరాములు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, పాఠ్య బోధనతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తారని అన్నారు. 2026 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ థీమ్‌కు అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు డా. బి. నాగభూషణం, డా. డి.సి. సుగప్ప, డా. బి. గోపాల్‌ నాయక్‌ మాట్లాడుతూ.. విజ్ఞాన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు అనన్యసామాన్యమని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.