అంగన్వాడీ కేంద్రంలో బాల అమృతం పంపిణీ
సూర్య, పెంచికల్‌పేట్ :
పెంచికల్‌పేట్ మండలం ఎల్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బాల అమృతం, పౌష్టికాహారాల పంపిణీతో పాటు చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, వారి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎల్లూరు సర్పంచ్ చప్పిడే రవీందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, సూపర్‌వైజర్ శంకరమ్మ, అంగన్వాడీ సిబ్బంది సరోజ, టీచర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.