ప్రజావాణికి రెండు దరఖాస్తులు
మర్పల్లి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 05): ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 18 శాఖల అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఒక దరఖాస్తు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి హౌసింగ్ శాఖకు ఒక దరఖాస్తు కలిపి మొత్తం రెండు దరఖాస్తులు అందాయి.ప్రజావాణి కార్యక్రమానికి వికారాబాద్ మండలానికి సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ (ఎన్‌ఫోర్స్‌మెంట్), స్టేషన్ ఫైర్ ఆఫీసర్ హాజరయ్యారు. అలాగే బంట్వారం మండలానికి సంబంధించి ఏఈపీఆర్, అటవీ శాఖ అధికారులు తమ శాఖల తరఫున హాజరయ్యారు.కాగా ఇరిగేషన్ శాఖ ఏఈ అధికారి ప్రజావాణికి గైర్హాజరయ్యారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఏఈ అధికారి హైదరాబాద్‌లో ఓడీపై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి, నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
రిపోర్టర్ రాములు.