BREAKING
పట్టపగలే దర్జాగా దొంగతనం ప్రతి గ్రాడ్యుయేట్ను ఓటరు లిస్టులో నమోదు చేయించాలి - తలసాని విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి ఆకివీడు సీఐ కాళీచరణ్ తెట్టెలపాడు నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన 25 కుటుంబాలు.-- మంత్రి పొంగులేటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చేరిక కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరుని సేవలో గవర్నర్‌ సతీమణి జానకి శుక్ల మర్యాదపూర్వకంగా డిప్యూటీ సీఎంను కలసిన జిల్లా ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఏఐ మార్ఫ్ వీడియోపై సెలబ్రిటీల స్పందనే దానికి ఎక్కువ పబ్లిసిటీ తెచ్చిపెట్టింది! సిద్ధి వినాయకుడి సన్నిధిలో జాన్వీక పుట్టినరోజు వేడుకలు ఘనంగా స్మార్టు కిచెన్‌కు రూ 32 లక్షలు కార్పొరేటు సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR ) విరాళం ఆదర్శ కుటుంబం సినిమా విడుదలపై సస్పెన్స్.. దసరా బరి నుంచి తప్పుకుంటుందా..? హమాలీల భద్రత మా బాధ్యత రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి మహేంద్ర దిబ్బగూడెం కాలువలో మృతదేహం గుర్తింపు రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

డాక్టర్ లేని ఆసుపత్రిలో చికిత్స

Select Suryaa Now
డాక్టర్ లేని ఆసుపత్రిలో చికిత్స

డాక్టర్ లేని ఆస్పత్రిలో చికిత్స: వైద్యం వికటించి వ్యక్తి మృతి

కాటారంలో తీవ్ర విషాదం.. నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన


రూ. 5 లక్షల బేరసారాలు.. వైద్యుడి ప్రమేయంపై అనుమానాలు

న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆసుపత్రి ముందు ధర్నా
కాటారం, అక్టోబర్ 05, మేజర్ సూర్య న్యూస్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర నిర్లక్ష్యం వెలుగుచూసింది. క్వాలిఫైడ్ డాక్టర్ అందుబాటులో లేని సమయంలో అర్హత లేని సిబ్బంది (నర్సు) అందించిన వైద్యం వికటించి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. కాటారం మండలం జాదరావుపేటకు చెందిన ఆత్మకూరి కుమార్ (40) అనే వ్యక్తి శనివారం సాయంత్రం వ్యవసాయ పనుల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఛాతిలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. కంగారుపడిన కుటుంబ సభ్యులు అతడిని తక్షణ చికిత్స కోసం కాటారంలోని బాలాజీ ఆసుపత్రికి తరలించారు.

డాక్టర్ లేరు.. నర్సే డాక్టరైంది!

కుమార్ ఆసుపత్రికి వచ్చే సమయానికి అక్కడ బాధ్యతగల డాక్టర్ ఎవరూ అందుబాటులో లేరు. కేవలం ఒక నర్సు మాత్రమే ఉన్నట్లు సమాచారం. అత్యవసర పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమైన ఆ నర్స్, తనకు ఎలాంటి సర్టిఫైడ్ అధికారం లేకపోయినప్పటికీ సొంతంగా వైద్యం అందించి, ఇంజెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే కుమార్ పరిస్థితి విషమించింది. ఊపిరి ఆడక విలవిలలాడుతున్న అతడిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించే లోపే మార్గమధ్యంలోనే కన్నుమూశాడు.

రూ. 5 లక్షల బేరం.. ప్రాణం ఖరీదు ఇంతేనా?

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వైద్యం వికటించి కుమార్ మృతి చెందడంతో ఆసుపత్రి యాజమాన్యం తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది. పోలీసు కేసు కాకుండా చూసేందుకు, బాధితుడి ప్రాణం ఖరీదును రూ. 5,00,000 (ఐదు లక్షల రూపాయలు) గా కడుతూ బంధువులతో లోపాయికారీ బేరసారాలకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

న్యాయం కోసం బంధువుల రోదన..

నిరుపేద కుటుంబానికి చెందిన కుమార్ మరణంతో అతని భార్య, పిల్లలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆసుపత్రి యాజమాన్యం, నర్సు నిర్లక్ష్యం వల్లే తమ మనిషి ప్రాణాలు కోల్పోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు, మృతదేహంతో ఆసుపత్రి ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, నకిలీ , నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.