భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
సూర్య జగిత్యాల ప్రతినిధి:సాధారణ తనిఖీ లో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సోమవారం రోజున దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు.గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.ఈ పర్యవేక్షణలో ఎన్నికల విభాగ పర్యావేక్షకురాలు జ్యోతి, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ మరియ తదితరులు పాల్గొన్నారు.