BREAKING
నంద్యాలలో“ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో జిల్లా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ రాజకుమారి గణియా మామిడి గుండాల భూరి సర్వే గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆల్కహాల్ అనే పేరు ఎలా వచ్చింది? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! | ఆల్కహాల్ చరిత్ర స్విస్ అధ్యక్షుడితో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ: భారత్-ఎఫ్‌టా వాణిజ్య ఒప్పందం పురోగతిపై హర్షం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ద్వైపాక్షిక చర్చలు మహిళా ఎస్సై కుటుంబానికి ఆకతాయిల వేధింపులు డ్రోన్ సిటీ ఫేజ్ ఫేజ్–1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* పట్టభద్రులారా మేల్కొనండి, ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి : బీజేపీ జిల్లా నాయకులు సోమ శేఖర్ గౌడ్, మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం: ఐదుగురితో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజా శంకుస్థాపన ఘనంగా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఈ.వీ.ఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్ పైప్ లైన్ లీక్ తో భారీ గా నీరు వృథా.

పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

Select Suryaa Now
పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

సూర్య,భీమ్‌గల్:పోలీసుల వేధింపులు తాళలేక ఓ చిరు హోటల్‌ నిర్వాహకుడు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. భీమ్‌గల్ బస్టాండ్‌లో హోటల్‌ నిర్వహిస్తున్న పొలాస సుధాకర్‌ను లేట్‌నైట్‌ వరకు హోటల్‌ నడుపుతున్నారంటూ పోలీసులు పలుమార్లు ప్రశ్నించి జరిమానాలు విధించినట్లు ఆరోపించారు.ఇప్పటికే తనపై మూడుసార్లు ఫైన్‌ వేసినట్లు సుధాకర్‌ తెలిపారు. తాజాగా జరిమానా విధించిన పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టుకు వెళ్లి ఫైన్‌ కట్టి రావాలని ఆదేశించినట్లు చెప్పారు.
తాను చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుధాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇతర దుకాణాలు కూడా తెరిచి ఉన్నప్పటికీ వారిని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.ఈ క్రమంలో సోమవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడి ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేసి, వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.