BREAKING
నంద్యాలలో“ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో జిల్లా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ రాజకుమారి గణియా మామిడి గుండాల భూరి సర్వే గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆల్కహాల్ అనే పేరు ఎలా వచ్చింది? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! | ఆల్కహాల్ చరిత్ర స్విస్ అధ్యక్షుడితో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ: భారత్-ఎఫ్‌టా వాణిజ్య ఒప్పందం పురోగతిపై హర్షం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ద్వైపాక్షిక చర్చలు మహిళా ఎస్సై కుటుంబానికి ఆకతాయిల వేధింపులు డ్రోన్ సిటీ ఫేజ్ ఫేజ్–1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* పట్టభద్రులారా మేల్కొనండి, ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి : బీజేపీ జిల్లా నాయకులు సోమ శేఖర్ గౌడ్, మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం: ఐదుగురితో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజా శంకుస్థాపన ఘనంగా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఈ.వీ.ఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్ పైప్ లైన్ లీక్ తో భారీ గా నీరు వృథా.

*వాహనదారులకు విద్యార్థుల కౌన్సెలింగ్ ఎస్సై కుటుంబరావుగారు*

Select Suryaa Now
*వాహనదారులకు విద్యార్థుల కౌన్సెలింగ్  ఎస్సై కుటుంబరావుగారు*

జంగారెడ్డిగూడెం:రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు వినూత్నంగా ముందడుగు వేశారు. పట్టణంలోని పాత ఎమ్మార్వో కార్యాలయం రోడ్డులో విద్యార్థులు వాహనదారులను ఆపి ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించారా, వాహనాలను జాగ్రత్తగా నడుపుతున్నారా అనే విషయాలను పరిశీలిస్తూ విద్యార్థులు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతను వివరించారు. వాహనం నడిపే సమయంలో సెల్‌ఫోన్ వినియోగించవద్దని, అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సూచించారు. రహదారిపై ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. వాహనదారులతో నేరుగా మాట్లాడి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. విద్యార్థులు నిర్వహించిన కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని ఎస్సై కుటుంబరావు దగ్గర ఉండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని, వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. విద్యార్థులు ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమం పట్ల పలువురు వాహనదారులు అభినందనలు తెలిపారు