BREAKING
కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. యూరోపియన్ యూనియన్ ఆశయాలపై ప్రభావం చూపేలా బోస్నియాలో సాధారణ ఎన్నికల పోలింగ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పర్యటన తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. శిలాతోరణం వరకు క్యూలైన్! థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ తీరానికి చేరుకున్న యూఎస్ యుద్ధనౌక బ్యానర్లు,ప్రేమ్స్ ధ్వంసం చేయడం పిరికిపందల చర్య స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్లు: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కీలక వాదనలు అభివృద్ధికి నోచుకోని ఆలయ కోనేరు జపనీయుల మహిళ హత్య కేసులో అమెరికా మెరైన్ అరెస్ట్ బలూచిస్తాన్ వేదికగా మహిళలతో ప్రత్యేక పోరాట దళం ఏర్పాటు ఆరుతడి పంటలను ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి మహిళపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు సిగ్గుచేటు కోల్‌కతా వేదికగా 2027 జనవరిలో 19వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు పాకిస్తాన్ డిప్లొమేట్‌ను సమన్లు జారీ చేసి తీవ్ర నిరసన తెలిపిన భారత్ విప్లవ వీరుడు శ్యామ్‌జీ కృష్ణవర్మకు ఘన నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

మందుబాబులకు నిలయాలుగా మారుతున్న ప్రకృతి వనాలు!

Select Suryaa Now
మందుబాబులకు నిలయాలుగా మారుతున్న ప్రకృతి వనాలు!

సూర్య బెజ్జుర్ :

గ్రామాల పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం కోసం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెజ్జూర్ మండలంలోని పలు గ్రామపంచాయతీల పరిధిలోని పల్లె ప్రకృతి వనాలను పట్టించుకునే వారు కరువయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కొన్ని ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయని, రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనాల పరిసరాల్లో పారిశుధ్యం, మొక్కల సంరక్షణ, పిచ్చిమొక్కల తొలగింపు, రక్షణ చర్యలు సక్రమంగా లేకపోవడంతో ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రాంతాలు నిరుపయోగంగా మారుతున్నాయని చెబుతున్నారు.ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బందిపై ఉన్నప్పటికీ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వనాల వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు, లైటింగ్, పరిశుభ్రత, మొక్కల సంరక్షణ వంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

• అధికారులు ఇకనైనా స్పందించాలి

బెజ్జూర్ మండలంలోని ఆయా గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న పల్లె ప్రకృతి వనాలపై సంబంధిత అధికారులు, ఎంపీడీఓ, పంచాయతీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేసి, వాటిని ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే ప్రాంతాలుగా మార్చాలే తప్ప మందుబాబులకు అడ్డాలుగా మారకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.