వర్షాల కొరత.. నీటి పొదుపే మార్గం... సమతా వెంకట్ రెడ్డి
కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమత వెంకట్‌రెడ్డి 14వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. వార్డులోని నీటి నల్లాలను పరిశీలించి సరఫరా పరిస్థితిపై ఆరా తీశారు.
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాలు తగినంతగా కురవడం లేదని, అందువల్ల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
(చేవెళ్ల - మేజర్ న్యూస్)