BREAKING
అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి కాంగ్రెస్‌ శ్రేణులకు ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ పిలుపు కళ్యాణదుర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా బోయ బాదెమ్మ నామినేషన్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతాం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చిక్కపేట దుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు. ఎంపీడీవో ఉషారాణి. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జగన్నాథవలస గ్రామంలో భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి కుంకుమ పూజలు, భారీగా అన్నదాన కార్యక్రమం అనుపమ నగర్ కమ్యూనిటీ హాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ఇంకొల్లు మండలంలో ఎం.పి.టి.సి వారీగా ఓటర్ల వివరాలు మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ.. రాజాం గాంధీనగర్లో భారీ అన్నసమారాధన లింగారెడ్డిగూడ గ్రామంలో దసరా వెలుగులు.... పరిశుభ్రమైన త్రాగునీరు సరఫరా లక్ష్యం సంప్రదాయ దుస్తుల్లో ఆడపడుచుల ఆటపాటలు.. పూల పండుగతో పల్లెల్లో సందడి రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అరాచకాలు పెచ్చు మీరాయి.

గడి మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్

Select Suryaa Now
గడి మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్

మేడ్చల్ ,మేజర్ న్యూస్: మేడ్చల్‌లోని శ్రీశ్రీశ్రీ గడి మైసమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా, ఆలయంలో లక్షపూల పూజను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గడి మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, దుర్గాదేవి అలంకరణ, లక్షపూల పూజ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ కోశాధికారి లవంగ శ్రీకాంత్, మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ ప్రధాన కార్యదర్శి కానుకంటి వంశీ విజయ్ వంజరి, ఉపాధ్యక్షుడు మైసరి రాజు వంజరి, నాయకులు పికెట్ నర్సింగ్ రావు, ఆలయ కమిటీ సభ్యులు తాళ్లపల్లి శివకుమార్, అనిల్, శ్యామరావు, రాము, మిరియాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.