కొల్చారం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సుడిగాలి పర్యటన
కొల్చారం …నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆదివారం కొల్చారం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని రాంపూర్, కిష్టాపూర్, వరిగుంతం, కోనాపూర్, ఎనగండ్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులు కొల్చారం మండల ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని మండపాల నిర్వాహకులు ఆవుల రాజిరెడ్డితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, చిన్న ఘనాపూర్ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, రాంపూర్ సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్, మాజీ సర్పంచ్ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు జంగిటి నాగరాజు, పెద్ది శ్రీశైలం, బండి మల్లేశం, ఎనగండ్ల మురళి, మాజీ ఉపసర్పంచ్ విజయ్, అచ్చన్న పల్లి శ్రీరాములు, ప్రవీణ్ రెడ్డి, రమేష్, పెద్దల కిషన్, నవీన్, పెంబరి మల్లేష్, మలిక ప్రవీణ్, భాస్కర్, ఎనగండ్ల రమేష్, డీలర్ బాలరాజ్, దాసు, మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.