37వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్
రాయదుర్గం (రాయదుర్గం ఇంచార్జ్ మేజర్ న్యూస్) : రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 37వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నాయకుల సిద్ధమ్మ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆమె నామినేషన్ సమర్పించారు.
37వ వార్డులో కౌన్సిలర్ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమ్మ నామినేషన్ దాఖలు చేయడంతో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధించడమే లక్ష్యంగా ఆమె బరిలో నిలిచారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం తుది అభ్యర్థుల జాబితా ఖరారు కానుంది.