ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు. ఎంపీడీవో ఉషారాణి.
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఎన్నికల అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందని అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఉషారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 24వ తేదీ నామినేషన్ల పరిశీలన, 25వ తేదీన నామినేషన్ ఫారం లో ఏమైనా తప్పిదాలు జరిగి తిరస్కరించిన నామినేషన్లపై అప్పిలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. 26వ తేదీ ఎన్నికల అధికారి తిరస్కరణ నామినేషన్ల పై తుది నిర్ణయం తీసుకుంటారని 27వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ అదే రోజు సాయంత్రం ఎంపీటీసీ పదవులకు పోటీ చేయు అభ్యర్థుల పేర్లు నోటీస్ బోర్డ్ లో ప్రకటిస్తామన్నారు. నవంబర్ మూడో తేదీ ఎంపిటిసి ఎన్నికలకు పోలింగ్, నాలుగవ తేదీ అవసరమైన చోట ఎన్నికల అధికారి అనుమతితో రీపోలింగ్, ఐదో తేదీ ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వెంటనే ఫలితాలు ప్రకటన గెలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి చే ధ్రువీకరణ పత్రం అందజేయడం జరుగుతుందన్నారు.