ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్న వైసిపి
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైసిపి - తెలుగుదేశం నేతలు
మిన్నల్ రవి, డా.యం.ఉమేష్ రావు
శ్రీకాళహస్తి, మేజర్ న్యూస్: భారత రాజ్యాంగం ప్రకారం నిర్దేశించిన విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను జగన్ రెడ్డి నాయకత్వంలో వైసిపి అరాచక శక్తులు భౌతిక దాడులతో రక్తసిక్తం చేసి ప్రజలను భయపెట్టి విజయం దక్కించుకోవడం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వన్నెకుల క్షత్రియ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి మరియు తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు ఆరోపించారు.
పుంగనూరు, తిరుపతి, రాయచోటి వంటి ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి, భౌతిక దాడులకు పాల్పడి, రక్తపు మరకలు అంటించుకొని తామే బాధితులమంటూ ప్రభుత్వంపై బురదజల్లుతూ ముసలి కన్నీరు కార్చడం వైసిపి అధినేత జగన్ రెడ్డికి పరిపాటిగా మారిందని, ఆయన తీరు చూస్తే దొంగే...దొంగా దొంగా అని అరిచినట్లు ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనీయకుండా చేయడం ద్వారా రాష్ట్రానికి అందవలసిన నిధులను, గ్రాంట్లు రానీయకుండా చేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలనే దుర్భుద్ధితో ఎలాగైనా ఎన్నికలను అడ్డుకోవాలని జగన్ రెడ్డి, మిదున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అవినాష్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు బెంగళూరు ప్యాలస్ లో కూర్చుని కుట్రలు చేశారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి రౌడీలను, అల్లరి మూకలను తీసుకొచ్చి, ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించి.. రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు జరుగుతున్నాయనే అపోహలను ప్రజలలో సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఓడిపోతున్నామన్న నిస్పృహలో జగన్ రెడ్డి దాడులకు తెగబడుతున్నారు. పులివెందుల నియోజకవర్గం కేంద్రంగా చేసుకొని, తన చుట్టూ ఉన్న నియోజకవర్గాల నాయకులుగా చలామణి అవుతున్న మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అవినాష్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి తదితరులతో అలజడి సృష్టించి, దానిని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్లు ప్రజలకు తెలియజేయడానికి వీధి నాటకాలు ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి నామినేషన్ సెంటర్ల వద్ద భూమన అభినయ్ చేసిన రౌడీ చేష్టలు, బెదిరింపులే దీనికి నిదర్శనం అని, అలాగే రాజంపేటలో అమర్‌నాథ్ రెడ్డి చేసిన అరాచకం రాష్ట్ర ప్రజలంతా గమనించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, తిరుపతి పార్లమెంటు నాయకులు గాజుల భగత్ రాయల్, పూల శేఖర్, పసుపులేటి శంకరయ్య, గంగనపల్లి రమేష్, సులేమాన్, బిజెపి నాయకుడు గోపీ తదితరులు పాల్గొన్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి 9644411197