BREAKING
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఉల్లుగమ్మ పీఠంలో వైభవంగా శరన్నవరాత్రి పూజలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన, దీపాలంకరణ, ఉయ్యాల సేవ పరాకాష్టకు చేరిన వైసీపీ నాయకుల పిచ్చి. ఎస్సై ఏడుకొండల పై దాడి అమానుషం. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు.

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ

Select Suryaa Now
ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ

ముగిసిన మునిసిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ
- చైర్మన్ అభ్యర్థికి 10 నామినేషన్లు 
- కౌన్సిలర్ అభ్యర్థులుగా 202 నామినేషన్లు 
ఆత్మకూర్, మేజర్ న్యూస్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కమిషనర్ బేబీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసింది. 16 నుంచి 18వ తేదీ వరకు సాగిన నామినేషన్ ప్రక్రియలో చైర్మన్ అభ్యర్థికి 10 నామినేషన్లు, కౌన్సిలర్ అభ్యర్థిగా 202 నామినేషన్లు దాఖలు అయినట్లు కమిషనర్ బేబీ తెలిపారు. చైర్మన్ అభ్యర్థికి వైఎస్ఆర్సిపి నుంచి 5 నామినేషన్లు, తెలుగుదేశం పార్టీ నుంచి 5 నామినేషన్ రాగా కౌన్సిలర్ అభ్యర్థులుగా బిజెపి -3, సిపిఐ-1, సిపిఎం -3, ఐ ఎన్ సి -1, తెలుగుదేశం పార్టీ-56, వైయస్సార్సీపి -105, జనసేన-5, ఎస్ డి పి ఐ -1, స్వతంత్ర అభ్యర్థులు-27 నామినేషన్ దాఖలు అయినట్లు ఆమె తెలిపారు. ఈనెల 21న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల జాబితా విడుదల చేసి జాబితా ఆధారంగా బ్యాలెట్ రూపకల్పన చేసి ఎన్నికల నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు