చిక్కపేట దుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
గుర్ల, సూర్య : మండలం చుక్కపేట గ్రామంలో శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం 5 గంటల నుంచి అమ్మవారికి పంచామృత నది జలాభిషేకం కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు మహమిడి సత్యనారాయణ శర్మ (బాలు ) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్య క్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అశేష భక్తజనం పాల్గొని అమ్మవారికి పంచామృత జలాభిషేకం జరిపించారు. ఈ జలాభిషేకంలో విజయ దుర్గ అమ్మవారి దేవాలయ ధర్మకర్త ఉప్పాడ నరసింగరావు దంపతులు,మరియు సుమారు 300 భవానీ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాని కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే గుజ్జంగవలస గ్రామంలో శనివారం రాత్రి దుర్గాదేవి అమ్మవారికి గ్రామంలో ఉన్న మహిళలు సారి, చీరలు సమర్పించారు. గ్రామంలో మహిళలు అధికంగా పాల్గొని గ్రామ పురవీధుల్లో నడుచుకుంటూ వచ్చి సారి చీరలు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని దుర్గాదేవి కమిటీ సభ్యులు నవ రాత్రులు పురస్కరించుకొని ప్రతీ రోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పురోహితులు మోహనరావు శర్మ వచ్చిన భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
రిపోర్టర్ : రాము నాయుడు, గుర్ల, విజయనగరం జిల్లా.