BREAKING
ఆలూరులో ఘనంగా బతుకమ్మ వేడుకలు పూల పండుగలో పులకించిన రెసిడెన్సి అపార్ట్మెంట్! ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్

అనుపమ నగర్ కమ్యూనిటీ హాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

Select Suryaa Now
అనుపమ నగర్ కమ్యూనిటీ హాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ :మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి (MLC) ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అనుపమ నగర్ కమిటీ హాల్ వేదికగా పైరాములగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఎరుకల మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలోని అర్హులైన గ్రాడ్యుయేట్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫారం-18 దరఖాస్తులను పూర్తి చేసి తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎరుకల మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. నవంబర్ 2023 నాటికి లేదా అంతకుముందే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో విద్యావంతులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడం బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరూ తగిన ధ్రువపత్రాలతో ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కావాలని ఆయన కోరారు. గతంలో ఓటరుగా ఉన్నప్పటికీ ప్రస్తుత కొత్త జాబితా కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శేఖర్ రెడ్డి, డి. అమర్నాథ్ రెడ్డి, గౌని వెంకటేష్ గౌడ్, బూరం ప్రకాష్, కంది శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్ యాదవ్, సిహెచ్. భాస్కర్, మోహన్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, లక్ష్మణరావు, ఉమేష్ యాదవ్ తదితర కాలనీ ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు, స్థానిక పట్టభద్రులు పాల్గొన్నారు.