BREAKING
నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఉల్లుగమ్మ పీఠంలో వైభవంగా శరన్నవరాత్రి పూజలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన, దీపాలంకరణ, ఉయ్యాల సేవ పరాకాష్టకు చేరిన వైసీపీ నాయకుల పిచ్చి. ఎస్సై ఏడుకొండల పై దాడి అమానుషం. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్న వైసిపి

మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ..

Select Suryaa Now
మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ..

హైదరాబాద్ మేజర్ న్యూస్ ::విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ, వాహన పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మలక్‌పేట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వినియోగించే పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు, ఇంటర్‌సెప్టర్లు, ద్విచక్ర వాహనాలతో పాటు రక్షణ విభాగం ఆయుధాలకు శాస్త్రోక్తంగా అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి గుమ్మడికాయలు కొట్టారు.

పోలీస్ సిబ్బంది విధుల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ప్రజలకు నిరంతరం అత్యున్నత స్థాయిలో శాంతిభద్రతల సేవలను అందించేలా జగన్మాత ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా సీఐ వెంకటరెడ్డి ఆకాంక్షించారు. సమాజంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తుందని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో పండుగలను జరుపుకోవాలని ఆయన కోరారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పూలతో అందంగా అలంకరించగా, ఈ పూజా కార్యక్రమంలో ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.