రాజాం గాంధీనగర్లో భారీ అన్నసమారాధన
రాజాం, సూర్య : రాజాం పురపాలక సంఘం పరిధి గాంధీ నగర్లో శ్రీ దుర్గా దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది భక్తులు అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు.ఉదయం వేదంపండితులు రవి ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రిపోర్టర్ : కె జె చక్రధరి, రాజాం, విజయనగరం జిల్లా.