లింగారెడ్డిగూడ గ్రామంలో దసరా వెలుగులు....
లింగారెడ్డిగూడలో రూ.6 లక్షలతో ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి….
ఫరూక్నగర్ , రంగారెడ్డి:
మండల పరిధిలోని లింగారెడ్డిగూడ గ్రామంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దసరా వెలుగులు నింపారు. గ్రామంలో రూ.6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మూడు హైమాస్ట్ లైట్లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్థానిక సర్పంచ్ ఎంసి రాజు ఉపసర్పంచ్ అశోక్ పిఎసిఎస్ చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు. దసరా పండుగను పురస్కరించుకుని గ్రామంలో చీకటిని తొలగించి వెలుగులు నింపేందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ లైట్లను ఏర్పాటు చేశారని గ్రామ కాంగ్రెస్ శ్రేణులు లు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీస వసతులను మెరుగుపరిచి గ్రామాలను అభివృద్ధి పథంలో నిలుపుతామని అన్నారు. విడతలవారీగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి, ఫరూక్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ ఎర్రోళ్ల అశోక్, గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్ గౌడ్, పురుషోత్తం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.