BREAKING
భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్.. వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన మూవీ కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ: రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇథియోపియా నేషనల్ ప్యాలెస్, మ్యూజియంను సందర్శించిన విదేశాంగ మంత్రి జైశంకర్ బీసీలకు టీడీపీ అండగా ఉంటుంది బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు

ఏఐ మాయతో ఎంపీ చామల గొంతు మార్పు

Select Suryaa Now
ఏఐ మాయతో ఎంపీ చామల  గొంతు మార్పు


‘
డిగ్‌ టీవీ పారడి’పై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

యాదాద్రి :ఏఐ సాంకేతికతను అడ్డుపెట్టుకుని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గొంతును మార్ఫింగ్‌ చేసి, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తప్పుడు వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ‘డిగ్‌ టీవీ పారడి’ చానెల్‌పై గురువారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.ఎంపీ మాట్లాడినట్లుగా నమ్మించేలా వాయిస్‌ను మార్చి తప్పుడు ప్రచారం చేయడం వెనుక ఉన్న వారిని గుర్తించాలని కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా సోషల్‌ మీడియాలో అసత్య వీడియోలను వైరల్‌ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కంటెంట్‌ రూపొందించడాన్ని అరికట్టాలని పేర్కొన్నారు. ఫిర్యాదు కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి పొత్నాక్‌ ప్రమోద్‌కుమార్, పీసీసీ డెలిగేట్‌ సభ్యుడు తంగేళ్లపల్లి రవికుమార్, కౌన్సిలర్లు కుక్కదువ్వు సోమయ్య, బెండెలాల్‌ రాజ్, షఫీక్‌ అహ్మద్, కోఆప్షన్‌ సభ్యుడు పల్లెర్ల యాదగిరి, సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల బాల్రాజ్, మాజీ జిల్లా అధ్యక్షుడు సామల రవీందర్, కాంగ్రెస్‌ నాయకులు మహమ్మద్‌ అతహర్, రాము, మచ్చ రాజు యాదవ్, శరత్, నేహాల్‌ తదితరులు పాల్గొన్నారు.